ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన శంకర్ దర్శకత్వం వహించిన గేమ్ ఛేంజర్ జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం కావడంతో అంచనాలు భారీగా పెరిగాయి. ఇప్పటికే పాటలు ప్రజాదరణ పొందాయి. రూ. 500 కోట్లకు పైగా ఖర్చు చేసి సినిమాను తెరకెక్కించారు. మెగా ఫ్యాన్స్ ఇప్పుడే సంబురాలలో మునిగి పోయారు.