తెలంగాణ యూనివర్సిటీ క్యాంపస్‌లోని హాస్టళ్లలో నెలకొన్న సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని వీసీ యాదగిరిరావు తెలిపారు. హాస్టల్ మెస్ కమిటీతోపాటు విద్యార్థులతో మాట్లాడి వసతులు, సమస్యలను తెలుసుకున్నారు. 24 గంటల పాటు వైఫై సౌకర్యాన్ని తక్షణమే అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. మిగిలి పోయిన పనులను త్వరలో పూర్తి చేయిస్తామని విద్యార్థులకు హామీ ఇచ్చారు.