ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె.విజయానంద్ వేద పండితుల ఆశీర్వచనాల మధ్య పదవీ బాధ్యతలు స్వీకరించారు.ఇప్పటి వరకు సిఎస్ గా పని చేసిన నీరబ్ కుమార్ ప్రసాద్ పదవీ విరమణ చేశారు. ఆయన స్థానంలో సీఎం చంద్రబాబు విజయానంద్ ను నియమించారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన పలువురికి కీలక పదవులు లభించేలా చూశారు.