అట్టహాసంగా సీఎం కప్ జిల్లాస్థాయి టోర్ని
NEWS Dec 19,2024 06:19 pm
గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు విద్యార్థులు, యువతలో వివిధ క్రీడల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడంతో పాటు ప్రోత్సహించడానికి సీఎం కప్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్‌బిన్ హందాన్ తెలిపారు. వాలీబాల్, బాస్కెట్‌బాల్, కరాటే తదితర క్రీడా పోటీల్లో ప్రతిభ చూపిన వారిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తారన్నారు. ప్రభుత్వం క్రీడారంగానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించిందన్నారు. క్రీడల్లో రాణించిన వారికి నగదు ప్రోత్సాహకాలు ఉంటాయన్నారు.