నా కుటుంబంపై హత్యకు కుట్ర
NEWS Dec 16,2024 03:53 am
మోహన్ బాబు కుటుంబంలో మరోసారి విభేదాలు బయట పడ్డాయి. మంచు మనోజ్ , మౌనికా రెడ్డి కలిసి మరోసారి మంచు విష్ణుపై ఫిర్యాదు చేశారు. జనరేటర్ లో చక్కెర కలిపిన డీజిల్ పోశారంటూ ఆరోపించారు. విద్యుత్ సరఫరా నిలిచి పోయిందంటూ వాపోయారు. తన తల్లి, తొమ్మిది నెలల పాపతో పాటు బంధువులు సైతం తీవ్ర ఇబ్బంది పడ్డారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై విష్ణు స్పందించ లేదు.