పవిత్ర నదుల్లో ఎన్నో ఏళ్లుగా కుంభమేళా జరుగుతోందని అన్నారు కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ప్రయాగరాజ్‌లో మహా కుంభమేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 30 కోట్ల మందికి పైగా భక్తులు పాల్గొనే అవకాశం ఉందన్నారు. కుంభమేళాలలో పెద్ద ఎత్తున హిందువులు పుణ్య స్నానాలు చేస్తారని వెల్లడించారు.