నేతలు కాదు కార్యకర్తలే బలం
NEWS Dec 15,2024 07:05 am
మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి అసలైన బలం నేతల నుంచి కాదని కార్యకర్తలేనని అన్నారు. కలిసికట్టుగా పని చేసి పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా, అరెస్ట్ లు చేసినా, కేసులు నమోదు చేసినా ఎదుర్కొంటామన్నారు. కార్యకర్తలకు అండగా ఉంటామని స్పష్టం చేశారు అమర్నాథ్.