శ్రీ బేడి ఆంజనేయుడికి అభిషేకం
NEWS Dec 15,2024 06:59 am
తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగా వెలసి వున్న శ్రీ బేడి ఆంజనేయ స్వామి వారికి శాస్త్రోక్తంగా ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. కార్తీక మాసం చివరి ఆదివారం సందర్భంగా ప్రతి సంవత్సరం ఆలయంలో ప్రత్యేక అభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. మూల మూర్తికి ఉదయం పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపులతో విశేషంగా అభిషేకం నిర్వహించారు.