మెట్ పల్లిలో దొంగల బీభత్సం
NEWS Dec 15,2024 06:39 am
మెట్ పల్లి పట్టణంలో దొంగలు బీభత్సం సృష్టించారు. పట్టణంలో 3 చోట్ల షటర్లు పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు. పాత బస్టాండ్ లోని ఎమ్.ఐ. స్టోర్ లో, సాయికృష్ణ థియేటర్ సమీపంలోని మయూరి హోటల్, ఆరపేటలో ఒక కిరాణా దుకాణంలో దొంగలు పడ్డారు. పోలీసులు చేరుకొని విచారణ చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.