పెద్దపల్లి జిల్లాలో గ్రూప్- 2 పరీక్షలకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు . ఈ పరీక్షకు 9018 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. 18 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి గంట ముందే చేరుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. పెద్దపల్లి గాయత్రి డిగ్రీ కాలేజ్ వద్ద నిమిషం ఆలస్యం నిబంధనతో ఓదెల గ్రామానికి చెందిన అమ్మాయితో పాటు అబ్బాయిని పరీక్షకు అనుమతించ లేదు. వారు కంటతడి పెట్టారు.