శనివారం ఉదయం బీర్పూర్ లో దోపిడీ దొంగలు బీభత్సం చేసిన విషయం తెలిసిందే. దీని దృష్ట్యా మల్యాల ఎస్సై నరేష్ కుమార్ మండల ప్రజలకు తగు సూచనలు చేశారు. పట్టణంలో కాని గ్రామాల్లో కాని అపరిచిత వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరించినట్లయితే తక్షణమే స్థానిక పోలీసులకు లేదా 100 కు డయల్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు. దయచేసి ప్రజలందరు ఎటు వెళ్లిన, ఎవరైన కొత్త వ్యక్తులతో మాట్లాడిన జాగ్రత్తగా, అప్రమతంగా ఉండాలని అన్నారు.