గ్రౌండ్ వాటర్ పై దృష్టి పెట్టండి
NEWS Dec 12,2024 02:55 am
రాష్ట్ర వ్యాప్తంగా గ్రౌండ్ వాటర్ నిల్వ పెంచేందుకు దృష్టి సారించాలని స్పష్టం చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. అన్ని జిల్లాల కలెక్టర్లు నీటి సంరక్షణ కోసం ప్లాన్స్ తయారు చేయాలని ఆదేశించారు. రాబోయే రెండు సీజన్లు అత్యంత ముఖ్యమన్నారు. రైతులు సాగు చేసేందుకు అవసరమైన నీటిని అందించే బాధ్యత మనపై ఉందన్నారు. ఎక్కడ కూడా ఇబ్బందులు రాకుండా చూడాలని అన్నారు .