రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి
NEWS Dec 11,2024 05:39 am
లారీని ఢీకొట్టి ఇద్దరు యువకులు మృతిచెందిన ఘటన నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం సికింద్రాపూర్ వద్ద చోటు చేసుకుంది. హైదరాబాద్ వెళ్తున్న లారీ సాంకేతిక లోపంతో రోడ్డు మధ్యలోనే నిలిచి పోయింది. నిజామాబాద్ జిల్లా కేంద్రం గోల్ హనుమాన్ ప్రాంతానికి చెందిన అంకిడి సంజయ్(22), కస్తూరి ప్రమోద్(22) ద్విచక్ర వాహనంపై ఆర్మూర్లో ఓ శుభకార్యానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.