అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో DEO కు సన్మానం
NEWS Nov 28,2024 01:21 pm
జగిత్యాల్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాముని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానం చేశారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి రాము మాట్లాడుతూ, జిల్లాలో తన వంతు క్రీడా రంగానికి సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మారుమూల గ్రామాల నుండి క్రీడాకారులను తయారుచేసి జిల్లా ప్రతిష్ట పెంచాలని క్రీడల వలన స్నేహభావం పెరిగి మానసిక ఒత్తిడి విద్యార్థులకుతగ్గుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో ఏలేటి మొత్తం రెడ్డి, రాందాస్, అంజయ్య, పాల్గొన్నారు.