బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ
NEWS Nov 27,2024 11:15 am
మెట్‌పల్లి మండలం చౌలమద్ది, ఆత్మనగర్ గ్రామాల్లో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు. బాల్య వివాహాలు చేయడం నేరమని, బాల్య వివాహాలు బాలికల విద్య, రక్షణ, ఆరోగ్యం అభివృద్ధికి ఆటంకమే కాకుండా వారి కలలను సాకారం చేసుకునే అవకాశాలను దూరం చేస్తుందని పలువురు పేర్కొన్నారు.స్పెషల్ ఆఫీసర్ మనిషా, ఐసీడీఎస్ సూపర్వైజర్ షమీం సుల్తానా, కార్య దర్శి నిజాముద్దీన్, అంగన్వాడీ టీచర్లు తదితరులున్నారు.