కథలాపూర్ మండలం తాండ్రియాలలో మహ్మద్ జమీల్ ఇంట్లో షాట్ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం జరిగింది. మంటలు చెలరేగాయి. ఇళ్లు పూర్తిగా దగ్ధమైంది. వస్తువులు, ఫర్నిచర్, నగదు, 10 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగింది. ప్రాణనష్టం జరగలేదు. స్థానికులు మంటలు ఆర్పడానికి తీవ్రంగా కష్టపడ్డారు. అప్పటికి ఇల్లు పూర్తిగా దగ్ధమైపోయింది. ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. ఘటన స్థలాన్ని ఎస్సై నవీన్ కుమార్ పరిశీలించారు.