కార్తీకమాస సోమవారం ప్రత్యేక పూజలు
NEWS Nov 25,2024 07:53 am
మల్లాపూర్ మండలం వాల్గొండ గ్రామంలో అపర భద్రాద్రిగా పేరుపొందిన శ్రీరామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాస చివరి సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు చేసారు. వేద పండితులు రాజశేఖర్ చారి ఆధ్వర్యంలో శివ కేశవుల ప్రీతికరంగామహాన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు. వివిధ గ్రామాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి, దీపాలు వెలిగించుకొని స్వామి వారిని దర్శించుకొన్నారు.