మెట్‌పల్లి మండలం వెల్లుల్ల గ్రామ శివారులో ఉన్న ఎల్లమ్మ గుడి వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా ప్రయాణిస్తున్న బైక్ అదుపుతప్పి రోడ్డుపై దూసుకుపోయింది. వాహనాన్ని నడుపుతున్న వ్యక్తికి తీవ్రగాయాలు కావడంతో సమాచారం అందుకున్న మెట్‌పల్లి పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.