మాదక ద్రవ్యాలు లభిస్తే కఠిన చర్యలు..
NEWS Nov 24,2024 05:01 am
నిర్మల్ పట్టణం లో గల వైఎస్ఆర్ కాలనీ లో శనివారం సాయత్రం పోలీస్ జగిలాలతో జిల్లా ఎస్పీ జానకి శర్మిల ఆదేశాలతో నిర్మల్ రూరల్ ఇన్స్పెక్టర్ టీం విస్తృత తనిఖీలు చేపట్టటం జరిగింది. మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా మార్చాలన్న సంకల్పంతో జిల్లా పోలీస్ శాఖ పనిచేస్తుందని, జిల్లాలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై స్పెషల్ డ్రైవ్ లు, నార్కోటిక్ జాగిలాలతో తనిఖీలు చేపడుతూ, మాదక ద్రవ్యాల రవాణాపై ఉక్కుపాదం మోపడం జరుగుతుందన్నారు.