ముగ్గురు పిల్లలున్నా పోటీ చేయొచ్చు?
NEWS Nov 20,2024 10:22 am
TG: ముగ్గురు సంతానం ఉన్న వారు సర్పంచ్ ఎన్నికల్లో పోటీకి అనర్హులనే నిబంధనను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించేందుకు నిర్ణయించిందని సమాచారం. దీంతో వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో ముగ్గురు పిల్లలున్న వారు సర్పంచ్‌లుగా పోటీ చేసేందుకు ఛాన్స్ ఉంటుంది. అటు APలో ఇద్దరికి మించి సంతానం ఉన్న వారికి పోటీకి అవకాశం కల్పించింది.