సర్వే: ఇంట్లో ఒక్కరున్నా సరిపోతుంది
NEWS Nov 05,2024 04:06 pm
తెలంగాణలో బుధవారం కులగణన సర్వే జరగ నుంది. ఈ సర్వేలో 56 ప్రధాన, 19 అనుబంధ ప్రశ్నలతో కలిపి మొత్తం 75 ప్రశ్నలు ఉంటాయి. ఈ సర్వేలో ప్రధాన ప్రశ్నలతోపాటు 19 ఉప ప్రశ్నలకు జవాబులు ఇవ్వాల్సి ఉంటుంది. సమగ్ర సర్వేకి వచ్చే సిబ్బంది మిమ్మల్నిగానీ, మీ కుటుంబీకులను గానీ ఫోటోలు తీయరు. అడగరు. ఎలాంటి ధృవీ కరణ పత్రాలు తీసుకోరు. కుటుంబంలో అందరూ ఉండాల్సిన అవసరంలేదు. కుటుంబ యజమాని వివరాలు చెబితే సరిపోతుంది.