బెంగళూరులో ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు ఎయిర్ టాక్సీలను అందుబాటులోకి తీసుకు రాబోతున్నారు. బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌తో ఒప్పందం చేసుకునేందుకు సరళ ఏవియేషన్ సిద్ధమైంది. ఎలక్ట్రానిక్ సిటీ నుంచి ఎయిర్‌పోర్ట్‌కు రూ.1700 ఛార్జి ఉంటుందని, 19 నిమిషాల వ్యవధిలో గమ్యస్థానానికి చేరుతుందని సరళ ఏవియేషన్ ప్రకటించింది. ప్రీమియం క్యాబ్‌లో ఇదే మార్గంలో 37.5 కిలోమీటర్లను 2 గంటలకుపైగా ప్రయాణించేందుకు రూ.2,500 ఖర్చు అవుతుంది.