ఫీజులు తక్షణమే విడుదల చేయాలి
NEWS Oct 15,2024 01:22 pm
ఖమ్మం: గత మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పీజీ రియంబర్స్‌మెంట్, స్కాలర్షిప్‌లను తక్షణమే విడుదల చేయాలని AISF రాష్ట్ర సహాయ కార్యదర్శి ఇటికాల రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గిరి ప్రసాద్ భవన్ లో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సర్కారు ఫీజులు చెల్లింపులు చెయ్యకపోతే చదువులు ఎలా సాగుతాయని ప్రశ్నించారు. ఈ విద్యా సంవత్సరం నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైన ఉందన్నారు.