వర్షాలు: 5 జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
NEWS Oct 14,2024 06:52 am
AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా చిత్తూరు, తిరుపతి, నెల్లూరు ప్రకాశం, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో ఈ 5 జిల్లాల్లోని పాఠశాలలు, కాలేజీలకు ఈరోజు సెలవు ప్రకటించారు. ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావొద్దని ప్రజలను హెచ్చరించారు. చిత్తూరు నుంచి వైజాగ్ వరకు వర్షాలు కురుస్తున్నాయి. గురువారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.