ఇసుక తరలింపుపై చర్యలు తీసుకోవాలి
NEWS Oct 14,2024 06:42 am
కథలాపూర్: బొమ్మన గ్రామంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని గ్రామస్తులు ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బొమ్మెన శ్రీమహాలక్ష్మి గుడి కాపు సంఘం సభ్యులు తమ సంఘ భవనం వెనకాల ఉన్న ఇసుకను తరలించడంతో గోడ కూలిపోయే ప్రమాదం ఉందని దీనితో ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉందని, గ్రామ వనరులు తరలిపోతున్నాయి అని చెప్పారు. ఇసుక తరలింపుపై కఠినమైన చర్యలు తీసుకోవాలని, సంఘ సభ్యులు ఎమ్మార్వోను కోరారు. అనంతరం ఎమ్మార్వో వినతిపత్రం అందించారు.