భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో గంజాయికి సంబంధించిన కేసులో తనను అన్యాయంగా ఇరికించారని కానిస్టేబుల్ సూసైడ్ వీడియో రిలీజ్ చేయడం పోలీస్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. చేయని తప్పుకు పడ్డ నింద తట్టుకోలేకపోతున్నానని, భార్య, తండ్రికి సెల్ఫీ వీడియో పంపి పురుగుల మందు తాగిన కానిస్టేబుల్ సాగర్. కాగా ప్రస్తుతం కానిస్టేబుల్ ను మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం.