ఘనంగా విజయ దశమి వేడుకలు
NEWS Oct 12,2024 03:58 pm
మంచిర్యాల: దసరా వేడుకలు పట్టణంలో ఘనంగా జరిగాయి. హమాలీవాడ కట్ట పోచమ్మ ఆలయం వద్ద హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించారు. జమ్మి ఆకులు తెంపి ఒక్కరికీ ఒకరు ఆలింగనం చేసుకున్నారు. ఎల్లపుడూ ఆయు ఆరోగ్యాలతో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమములో అర్చకులు సంగార్స్ సంతోష్ శర్మ, RSS నగర కార్యవహా పర్వతాల నర్సయ్య, బాపూజీ, ఉత్సవ సమితి కార్యదర్శి కర్ణకంటి రవీందర్, గుడి మల్లేష్, సంఘర్ష శర్మ, సందేశ్ గుప్తా, సంజీవ్, మహిళలు పాల్గొన్నారు.