భీమరం మండలం రాగోజీపేట గ్రామంలో దసరా పండగ పూట విషాదం నెలకొంది. స్థానికుల వివరాల ప్రకారం.. దుర్గ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకొని మహిషాసుర మర్ధిని కార్యక్రమంలో రవణాసూరకి నిప్పు పెట్టే ప్రయత్నంలో పక్కనే ఉన్న ట్రాన్స్‌ఫర్మర్ వైర్లు తగిలి అరిసెల వెంకటేష్ (36) అక్కడే కుప్పకూలి పడిపోయాడు. గ్రామస్తులు వెంటనే జగిత్యాల ప్రభుత్వ హాస్పిటల్‌కి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు.