మల్లాపూర్ మండల కేంద్రానికి చెందిన నల్ల లక్ష్మి (60) బావిలో దూకి మృతి చెందినట్లు ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. మృతురాలి చిన్నకూతురు పెళ్లి జరిగిన కొన్ని నెలలకే విడాకులు తీసుకుని ఇంటి వద్దనే ఉంటుంది. కూతురి జీవితం ఇలా అయ్యిందని మనస్తాపంతో మంగళవారం రాత్రి బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి పెద్ద కూతురు గంగజల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు SI తెలిపారు.