ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
NEWS Oct 10,2024 05:39 am
సిరిసిల్ల: గుండెనే గుడిగా పూలనే దేవతగా 9 రోజులపాటు కొలిచే బతుకమ్మ పండగ చివరి రోజు సంబరాలు నేడు సిరిసిల్లలో మానేరు ఒడ్డున ఘనంగా జరగనున్నాయి. 9 రోజులు వివిధ రూపాల్లో పూజ చేసే బతుకమ్మ పండుగ చివరి రోజు సద్దుల బతుకమ్మగా ఆటపాటలతో పులిహోర పెరుగన్నం వివిధ పిండితో చేసిన సత్తులతో వాయినాలు పంచుకుంటూ సంబూరంగా జరుపుకుంటారు.