రతన్ టాటాకు సినీ ప్రముఖుల నివాళులు
NEWS Oct 10,2024 04:42 am
సేవలో ఆయనను మించినవారు లేరని, భారతీయులందరికీ ఇది బాధాకరమైన రోజు అని చిరంజీవి అన్నారు. ఆయన ఓ లెజెండ్ అని, ఎప్పటికీ మన హృదయాల్లో జీవించే ఉంటారని రాజమౌళి అన్నారు. రతన్ టాటాది గోల్డెన్ హర్ట్ అని, దేశం ఆయనకి రుణపడి ఉంటుందని ఎన్‌టీఆర్ అన్నారు. గొప్ప వ్యక్తికి వీడ్కోలు పలుకుతున్నాం, ఆయన వెలుగులు ఎంతో మంది జీవితాల్లో నిలిచే ఉంటారు అని మహేష్ అన్నారు.