సద్దుల బతుకమ్మ పండగ సందర్భంగా సిరిసిల్ల పట్టణంలోని బతుకమ్మ ఘాట్ల వద్ద పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏర్పాట్లను పురపాలక సంఘ అధ్యక్షురాలు జిందం కళ చక్రపాణి పరిశీలించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర పండగ అయినా బతుకమ్మ పండగలో భాగంగా సద్దుల బతుకమ్మ పండగ రోజున ఆడపడుచులందరూ ఆనందంగా కుటుంబ సభ్యులతో కలిసి బతుకమ్మ పండుగను నిర్వహించుకునేలా మానేరు నది తీరంలో బతుకమ్మ ఘాటు వద్ద బతుకమ్మ పండగ నిర్వహణ కోసం తగిన ఏర్పాట్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.