అరకు: గడప గడపకు మన ప్రభుత్వం పనుల నిధుల విడుదల కొరకు ఎంపీ కి వినతి
NEWS Aug 27,2024 05:35 pm
అరకులోయ మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు, బస్కి పంచాయితీ సర్పంచ్ పాడి రమేష్ పాడేరులో ఉన్న అరకు ఎంపీ డా గుమ్మా తనూజరాణి ని మర్యదపూర్వకంగా కలిశారు. గత పారభుత్వంలో గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంజూరైన పనులు పూర్తయినా ఇప్పటివరకూ నిధులు విడుదల కాలేదని సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు పాడి రమేష్ ఎంపీ కి తెలియజేశారు. ఈ నేపథ్యంలో నిధుల విడుదలకు కృషి చేయాలంటూ ఎంపీ కి వినతి పత్రం అందించారు.