ప్రత్యేక బృందాల ఏర్పాటు: కలెక్టర్
NEWS Aug 27,2024 05:33 pm
కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ అలైన్మెంట్ ఉన్న గ్రామాల్లో సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు ప్రత్యేక బృందాలను నియమించామని కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. అమలాపురం కలెక్టరేట్లో రైల్వే నిర్మాణం పనులపై ఆయన సమీక్ష నిర్వహించారు. కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ ప్రాజెక్టులో గౌతమి, వైనతేయ, వశిష్ట నదులపై వంతెన నిర్మాణాలపై ముందుకు వెళ్లాలని రైల్వే అధికారులకు సూచించారు.