మంత్రులను కలిసిన రాజానగరం ఎమ్మెల్యే బత్తుల
NEWS Aug 27,2024 05:33 pm
రాజానగరం MLA బత్తుల బలరామకృష్ణ అమరావతి సచివాలయంలో హోంమంత్రి వంగలపూడి అనిత, దేవాదాయశాఖ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డిని కలిసారు. లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కోరుకొండ భూముల నిషేధ తొలగింపు, రంగనాథ స్వామి ఆలయంలో రాజగోపురం పునర్నిర్మాణం, కోరుకొండ లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం అభివృద్ధి, కనుపూరులో శివపార్వతుల విగ్రహం ఏర్పాటు, 2027 పుష్కరాలు తదితర విషయాలు చర్చించారు. రాజానగరంలో పలు సమస్యలపై చర్చించారు.