ముక్తేశ్వరంలో బిజెపి మండల సమావేశం
NEWS Aug 27,2024 01:53 pm
అయినవిల్లి మండలంలో బీజేపీ పార్టీ సభ్యత్వం నమోదు కొరకు మండల కార్యవర్గ సమావేశం ముక్తేశ్వరం పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు కుడుపూడి చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిధిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అడబాల సత్యనారాయణ,పాలూరి సత్యానందం పాల్గొని సభ్యత్వ నమోదు చేయడం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ చీకురుమెల్లి వెంకటేశ్వరరావు, గనిశెట్టి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.