KTR ఫాంహౌస్ కూల్చివేతకు సిద్ధం?
NEWS Aug 27,2024 11:54 am
జన్వాడలోని కేటీఆర్ మిత్రుడికి చెందిన ఫాంహౌస్ కూల్చివేతకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు ఫామ్ హౌజ్ వద్దకు వెళ్లిన ఇరిగేషన్ అధికారులు కొలతలు వేస్తున్నారు. దీంతో ఏ క్షణమైనా కూల్చివేతకు బుల్డోజర్లు వెళ్లే అవకాశం ఉందంటున్నారు. ఈ ఫాంహౌస్ నిబంధనలకు ఉల్లంఘించి నిర్మించారని సీఎం రేవంత్.. నాడు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో సైతం ఈ ఫాంహౌస్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇది కేటీఆర్ దేనని ఆయన స్పష్టం చేశారు.