భారీ వర్షాలకు గుజరాత్ అస్తవ్యస్తం
NEWS Aug 27,2024 11:18 am
గుజరాత్‌ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత 3 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. రాష్ట్రం మొత్తం అస్తవ్యస్తమైంది. జనజీవనం స్తంభించిపోయింది. ప్రధాన డ్యామ్‌లు, నదుల్లో నీటి మట్టాలు పెరిగాయి. చాలా నదులు ప్రమాదకరస్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. వందలాది మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.