దేవగుప్తం రామాలయం వీధిలో రోడ్డుపై నిలిచిన వర్షపు నీరు
NEWS Aug 25,2024 08:14 am
అల్లవరం మండలంలోని దేవగుప్తం రామాలయం వీధిలో కొద్దిపాటి వర్షం కురిసినా రోడ్డుపై నీరు నిలిచిపోతోంది. దీంతో రామాలయంవీధిలో నివసించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎవరికి వారే ఇళ్ల ముందు మట్టిని మెరకగా వేసుకోవడంతో నీరు దిగే మార్గం లేక వర్షకాలం నుంచి సీసీ రోడ్డుపై వర్షం నీరు దర్శనమిస్తోంది. మురుగునీరు పారేందుకు డ్రెయిన్ ఏర్పాటు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.