TRS యూత్ జనరల్ సెక్రటరీగా రాము
NEWS Oct 26,2026 05:23 am
కామారెడ్డి జిల్లా టీఆర్ఎస్ యూత్ జనరల్ సెక్రటరీగా రాజంపేట మండల కేంద్రానికి చెందిన జొన్నల రామును పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు కవిత నియమించారు. గత 13 ఏళ్లుగా కవిత ఆధ్వర్యంలోని జాగృతి కార్యక్రమాల్లో, కామారెడ్డి జిల్లాలో క్రియాశీలకంగా పనిచేస్తున్న రాముకు ఈ పదవి దక్కింది. ఈ సందర్భంగా ఆయన కవితకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. తన నియామకానికి సహకరించిన కామారెడ్డి జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు గైని శ్రీనివాస్ గౌడ్, ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జి సంపత్ గౌడ్, రాష్ట్ర యూత్ అధ్యక్షుడు శివారెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు.