ఎంపీటీసీ, జడ్పీటీసీ తుది జాబితా
NEWS Oct 25,2026 09:43 pm
ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు నామినేషన్ల పరిశీలన అనంతరం రాష్ట్ర ఎన్నికల సంఘం తుది జాబితాను విడుదల చేసింది. 9,829 ఎంపీటీసీ స్థానాలకు 46,045 నామినేషన్లు సక్రమంగా ఉన్నట్లు ప్రకటించింది. వీరిలో టీడీపీ నుంచి 19,760, వైసీపీ నుంచి 17,726, జనసేన నుంచి 4,330, బీజేపీ నుంచి 1,049, స్వతంత్ర అభ్యర్థులు 2,012 మంది ఉన్నారు. అలాగే 659 జడ్పీటీసీ స్థానాలకు 4,770 నామినేషన్లు సక్రమంగా ఉన్నట్లు వెల్లడించింది. వీరిలో టీడీపీ 1,693, వైసీపీ 1,445, జనసేన 587, బీజేపీ 227, స్వతంత్ర అభ్యర్థులు 227 మంది ఉన్నారు.