లింగంపేట్: తెలంగాణ రక్షణ సేన ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జి ఎదురుగట్ల సంపత్ గౌడ్ తన దాతృత్వాన్ని చాటుకున్నారు. లింగంపేట్ మండల కేంద్రంలోని మహారాజుల కాలనీలో నిర్మిస్తున్న ముత్యాల పోచమ్మ ఆలయ నిర్మాణానికి రూ.50 వేల ఆర్థిక సహాయం అందించారు. శనివారం మండల అధ్యక్షుడు పోకల సాయిరాం ఆధ్వర్యంలో ఆలయ నిర్వాహకులకు ఈ మొత్తాన్ని అందజేశారు. ఆలయ నిర్మాణంలో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందని సంపత్ గౌడ్ తెలిపారు. ఆధ్యాత్మికతను పెంపొందించే దేవాలయాల నిర్మాణానికి భవిష్యత్తులోనూ తన వంతు సహకారం అందిస్తానని పేర్కొన్నారు.