దినకర్మకు హాజరైన సంపత్ గౌడ్
NEWS Oct 25,2026 09:36 pm
కామారెడ్డి: జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని నాగిరెడ్డిపేట మండలం పోచారం గ్రామానికి చెందిన కాలాలి పెద్దబోయిన శ్రీనివాస్ గౌడ్ కుమారుడు సాయిచరణ్ తేజ గౌడ్ దినకర్మ కార్యక్రమానికి టీఆర్ఎస్ ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇన్‌చార్జి ఎదురుగట్ల సంపత్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు భాగారెడ్డి, మహిళా అధ్యక్షురాలు పద్మ, వర్కింగ్ ప్రెసిడెంట్ ఫహీమ్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు శ్రీను తదితరులు పాల్గొన్నారు.