పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
NEWS Oct 25,2026 07:31 pm
కోరుట్ల మండలం ఐలాపూర్ జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో ఆదివారం 2004–05 పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఎన్నో ఏళ్ల తర్వాత కలుసుకున్న విద్యార్థులు పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఆనందంగా గడిపారు. ఒకరి యోగక్షేమాలను మరొకరు తెలుసుకుంటూ తమ పాఠశాల రోజుల అనుభవాలను గుర్తుచేసుకున్నారు. ఈ సమ్మేళనంతో పూర్వ విద్యార్థుల్లో స్నేహబంధం మరోసారి చిగురించింది.