టీఆర్ఎస్‌లో చేరిన జలాల్‌పూర్ నాయకులు
NEWS Oct 25,2026 07:30 pm
ఎల్లారెడ్డి నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జి ఎదురుగట్ల సంపత్ గౌడ్ ఆధ్వర్యంలో నాగిరెడ్డిపేట మండలం జలాల్‌పూర్ గ్రామానికి చెందిన నాయకులు సకలి ప్రవీణ్, సకలి సిద్ధూ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు భాగారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఫహీమ్, నియోజకవర్గ సీనియర్ నాయకుడు ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా పార్టీలో చేరిన నాయకులకు పార్టీ శ్రేణులు స్వాగతం పలికాయి.