గిద్దలూరు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ కూటమి బలపరిచిన బీజేపీ అభ్యర్థి డాక్టర్ జేవీ నారాయణ ప్రచారం నిర్వహించారు. నల్లబండ బజార్లో ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను కలిసి మద్దతు కోరారు. రేపు జరగనున్న ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని అభ్యర్థించారు. గిద్దలూరు పట్టణ అభివృద్ధికి బీజేపీతోనే సాధ్యమని ఆయన పేర్కొన్నారు. ప్రచారంలో స్థానిక ఓటర్లను కలిసి తనకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.