ప్రభుత్వం నీటిని విడుదల చేయాలి
NEWS Oct 24,2026 09:45 pm
తెలంగాణలో కరువు వస్తుందని తాగునీరు దొరకదని సీఎం హోదాలో రేవంత్ రెడ్డి మాట్లాడడం సరికాదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. భూపాలపల్లి జిల్లా కన్నపల్లి పంప్ హౌస్ ప్రాంతాన్ని బిఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి ఎర్రబెల్లి సందర్శించారు.కరువు పరిస్థితిలను ఎదుర్కొనేందుకు ఏపీ ముఖ్యమంత్రి వివిధ ప్రాజెక్టులు,జల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారిస్తూ నీటి కొరతను అధిగమించడానికి చర్యలు చేపడుతుంటే మన ముఖ్యమంత్రి అలాంటి చర్యలు చేపట్టకుండా చేతులెత్తేసారని విమర్శించారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి కళ్ళు తెరిచి నీటిని అందించాలని కోరారు.