ఢిల్లీ నిరసనలో పెద్ద ఎత్తున పాల్గొనాలి
NEWS Oct 24,2026 09:45 pm
ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటు హక్కు రక్షణ కోసం నవంబర్ 1న ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో 'ఓటు బచావో-దేశ్ బచావో' నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మాదిగ హక్కుల దండోరా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పేరుమాండ్ల రామకృష్ణ తెలిపారు. హనుమకొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నవంబర్ 1న ఢిల్లీలో నిర్వహించే నిరసనకు దళితులు, బహుజనులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.దళితులపై ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు.