బాక్సింగ్‌లో హరిణి ప్రతిభ.. రాష్ట్రస్థాయికి ఎంపిక
NEWS Oct 23,2026 04:33 pm
జగిత్యాలలో నిర్వహించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి పాఠశాలల బాక్సింగ్ పోటీల్లో తాటిపల్లి గురుకుల విద్యార్థిని టి. హరిణి ప్రతిభ చాటింది. మల్యాల మండలం తాటిపల్లి గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న హరిణి అండర్-17 విభాగంలో 44–46 కిలోల కేటగిరీలో సత్తా చాటి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది. ఈ నెల 25 నుంచి 27 వరకు రంగారెడ్డిలో జరిగే పోటీల్లో పాల్గొననుంది. పాఠశాల ప్రిన్సిపాల్ మానస, పీఈటీ మధులిక హరిణిని అభినందించారు. సర్పంచ్, ఉపాధ్యాయులు, గ్రామస్థులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.