టీటీడీకి రూ.20 లక్షల విరాళం
NEWS Oct 23,2026 10:01 pm
ఒంగోలుకు చెందిన భక్తుడు గడ్డం వేణుగోపాల్ టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు రూ.20 లక్షలు విరాళంగా అందించారు. గురువారం తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరిని కలిసి విరాళానికి సంబంధించిన డీడీని అందజేశారు. శ్రీవారి భక్తులకు అన్నప్రసాద వితరణ కోసం ఈ ట్రస్టు సేవలు అందిస్తోంది.